అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘మఫ్తీ పోలీస్’. దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించాడు. జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్.ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 21న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అర్జున్, ఐశ్వర్య రాజేష్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ థ్రిల్లింగ్ సీన్స్‌తో ఇంప్రెస్ చేసింది. ‘బిగ్ బాస్’ ఫేమ్ అభిరామి, రామ్‌కుమార్, జి.కె. రెడ్డి, పి.ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ ఇతర పాత్రలు పోషించారు. ఆశివాగన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేరోజున ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఇటేవలే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ సీన్స్ తో అంచనాలను పెంచింది. ‘కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది. ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది’ అని అర్జున్ చెప్పిన డైలాగ్ స్టోరీ ఐడియాని ప్రజెంట్ చేస్తోంది. అర్జున్ యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఐశ్వర్య రాజేష్ ఇంటెన్స్ క్యారెక్టర్ టీజర్ లో ఆకట్టుకుంది.
