ఒలంపిక్స్‌లో సరిగా ఆడని అథ్లెట్లపై చర్యలు

ఒలంపిక్స్‌లో సరిగా ఆడని అథ్లెట్లపై చర్యలు
  • ఇండియా అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్‌‌ వార్నింగ్‌‌
     

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌‌ బరిలో ఉన్న అథ్లెట్లకు అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఏఎఫ్‌‌ఐ) వార్నింగ్‌‌ ఇచ్చింది. మెగా గేమ్స్‌‌లో పెర్ఫామ్ చేయని, తమ బెస్ట్‌‌ ఇవ్వని అథ్లెట్లపై చర్యలు తీసుకుంటామని శుక్రవారం హెచ్చరించింది. అలాగే, ఫామ్‌‌ కోల్పోయిన లాంగ్‌‌ జంపర్‌‌ శ్రీశంకర్‌‌, 20 కి.మీ . రేస్‌‌ వాకర్‌‌ కేటీ ఇర్ఫాన్‌‌ను ఒలింపిక్స్‌‌ అథ్లెటిక్స్‌‌ టీమ్‌‌ నుంచి తప్పించకూడదని  ఎమర్జెన్సీ మీటింగ్‌‌లో  ఏఎఫ్‌‌ఐ సెలక్షన్‌‌ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో జరిగిన ట్రయల్స్‌‌లో ఏమాత్రం ఆకట్టుకోలేని ఈ ఇద్దరు అథ్లెట్లను ఒలింపిక్స్‌‌ నుంచి విత్‌‌డ్రా చేయాలని పలువురు మెంబర్స్‌‌ సూచించినా..కమిటీ ఒప్పుకోలేదు. అథ్లెట్ల ఫిట్‌‌నెస్‌‌ను అంచనా వేసేందుకే ఫెడరేషన్‌‌ ఆ ట్రయల్స్‌‌ నిర్వహించిందని, అంతే తప్ప వాళ్ల ఫామ్‌‌ను అంచనా వేయడానికి కాదని పేర్కొంది. ట్రయల్స్‌‌లో శ్రీశంకర్‌‌, ఇర్ఫాన్‌‌ల పేలవ ఫామ్‌‌ గురించి ఈ ఇద్దరి కోచ్‌‌లతో మాట్లాడినట్టు ఏఎఫ్‌‌ఐ ప్రెసిడెంట్‌‌ అదిల్లే సుమరివాల చెప్పారు. ‘టోక్యోలో ఇద్దరు అథ్లెట్లు తమ బెస్ట్‌‌ ఇస్తారని వాళ్ల కోచ్‌‌లు ప్రామిస్‌‌ చేశారు. ఒలింపిక్స్‌‌లో అథ్లెట్లు బాగా పెర్ఫామ్‌‌ చేయకపోతే మేం వారిపై చర్యలు తీసుకుంటాం’ అని టోక్యో వెళ్లిన అందరు అథ్లెట్లకు అదిల్లే స్పష్టం చేశారు.