
బాలీవుడ్ యాక్షన్ హీరో, ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్ ఖిలాడీ అక్షయ్ కుమార్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. గతంలో విమల్ ఇలాచీ బ్రాండ్ కు అజయ్ దేవగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. కొంతకాలానికి అదే బ్రాండ్ కోసం చేసిన ఓ యాడ్ లో బాలీవుడ్ బాద్షాతో కలిసి అజయ్ నటించారు. ఇద్దరు బాలీవుడ్ హీరోలు టొబాకో బ్రాండ్‌ని ప్రమోట్ చేయడమేంటని విమర్శలు సైతం వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ విమర్శలు మరింత ముదరడానికి కారణం.... వాళ్లిద్దరితో పాటు అక్షయ్ కుమార్ సైతం ఆ బ్రాండ్ ప్రమోషన్ యాడ్ లో కనిపించారు. విమల్ ఇలాచీ యాడ్‌లో అజయ్, షారుఖ్ తో కలిసి ఖిలాడీ కుమార్ నటించారు. ఆ యాడ్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో టొబాకో బ్రాండ్ కి యాడ్ ఫిల్మ్స్ చేయనన్న అక్షయ్ వీడియోని కొంతమంది షేర్ చెయ్యగా ..మరికొంత మంది మీమ్స్ తో దాడి చేశారు. దీంతో అక్షయ్ కుమార్ క్షమాణలు చెప్పడంతో పాటు ఆ ప్రకటన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. యాడ్ ద్వారా వచ్చే డబ్బులను మంచి పనులకు డొనేట్ చేస్తానని ప్రకటించారు. దాంతో పాటు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానన్నారు. బ్రాండ్ తో ఉన్న కాంట్రాక్టు వల్ల నిర్ణీత కాలపరిమితి వరకు ఆ యాడ్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.