
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నటి అమీషా పటేల్ జూన్ 17న రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయారు. సీనియర్ డివిజన్ న్యాయమూర్తి డిఎన్ శుక్లా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 21న మళ్లీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసు 2018 నాటిది. జార్ఖండ్‌కు చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్.. అమీషాపై పై చీటింగ్, చెక్ బౌన్స్ కేసు నమోదు చేశారు.
ఇంతకుముందు ఈ కేసులో కోర్టు ఆమెకు చాలాసార్లు సమన్లు జారీ చేసింది. కానీ అమీషా పటేల్ హాజరు కాలేదు. ఆ తర్వాత కోర్టు ఆమెకు ఏప్రిల్ 6న వారెంట్ జారీ చేసిందని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది విజయ లక్ష్మీ శ్రీవాస్తవ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, సింగ్ "దేశీ మ్యాజిక్" అనే సినిమా నిర్మాణం కోసం అజయ్ కుమార్ సింగ్ బ్యాంక్ ఖాతాకు రూ. 2.5 కోట్లు బదిలీ చేశారు. కానీ పటేల్ ఆ తర్వాత అతని సినిమాతో ముందుకు వెళ్లలేదు. దీంతో ఆ డబ్బును ఆమె చెక్కు రూపంలో ఇచ్చారు. కానీ అది బౌన్స్ అయింది.
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌తో కలిసి అమీషా పటేల్ చేసిన గద్దర్ 2 సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఈ చిత్రంతో ఆమె వెండి తెరపై రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదుట ఆమె లొంగిపోయిన ఘటన వార్తల్లో నిలడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.