Purusha Movie: పెళ్లి తర్వాత భర్తల సమస్యలపై ‘పురుష:’.. హీరో పవన్ కళ్యాణ్ క్రేజీ టాక్ వైరల్

Purusha Movie: పెళ్లి తర్వాత భర్తల సమస్యలపై ‘పురుష:’.. హీరో పవన్ కళ్యాణ్ క్రేజీ టాక్ వైరల్

బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా వీరు వులవల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుష:’. బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. మే 22న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ ‘నా మొదటి సినిమాగా ప్రేక్షకులను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేయాలనుకున్నా. ఇది కంప్లీట్  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. పెళ్లి తర్వాత ప్రతి భర్త ఎదుర్కొనే  సమస్యలను ఇందులో ఫన్నీగా చూపించాం. ఈ చిత్రంలో అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది.

‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాని ఆడియెన్స్ ఎంతో ఎంజాయ్ చేశారో.. మా సినిమా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్‌‌‌‌ని ఆకట్టుకుంటుంది. మంచి చిత్రాన్ని చూశామన్న  ఫీలింగ్‌‌‌‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. 

ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. సప్తగిరి,  కసిరెడ్డి ప్రతి  విషయంలో హెల్ప్ చేశారు. డైరెక్టర్ వీరు నాకెంతో సపోర్ట్ చేశారు.  నేను చాలా ఇంట్రోవర్ట్‌‌‌‌గా ఉండేవాడ్ని.  నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ చిత్రంతో  కచ్చితంగా టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందని భావిస్తున్నా’ అని అన్నాడు.