
ప్రముఖ సీనీ నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తియ్యాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగగా, ఆయన కుమారుడు రవిబాబు అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఈ నెల 25 న గుండెపోటుతో చలపతిరావు మరణించారు. అయితే ఆయన ఇద్దరు కుమార్తెలు ఇవాళ విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటివరకు ఆయన పార్దీవ దేహాన్ని మహాప్రస్థానంలోని ఫ్రీజర్లో ఉంచారు.చలపతిరావుకు ఒక కుమారుడు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. రవిబాబు ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా కొనసాగుతున్నారు.
600కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు... నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 1966లో ‘గూడచారి 116’ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు.ఇక తన చివరి సినిమా కూడా కొడుకు డైరెక్షన్లోనే నటించారు. ఐదు రోజుల క్రిందటే ఆ షూటింగ్లో కూడా పాల్గొన్నారు.