నటుడు చంద్రమోహన్‌ అంతక్రియలు..నివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు

నటుడు చంద్రమోహన్‌ అంతక్రియలు..నివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు

సీనియర్ నటుడు చంద్రమోహన్‌ (Chandramohan) 2023, నవంబర్ 11వ తేదీ ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ నవంబర్ 13న మధ్యాహ్నం 12 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంతక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 

ఇవాళ ఉదయం చంద్రమోహన్ ఇంటి దగ్గర నుంచి 11 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుందని తెలియజేశారు. చంద్రమోహన్ తమ్ముడైన మల్లంపల్లి శ్రీనివాస్ అంతిమ సంస్కారాలను జరుపుతారని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి వీడ్కోలుగా సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు నివాళులు అర్పిస్తున్నారు.  

అయితే చంద్రమోహన్ అంత్యక్రియలు రెండు రోజుల పాటు ఆలస్యంగా జరగడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. చంద్ర మోహనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తెన మధుర మీనాక్షి ప్రస్తుతం అమెరికాలో సైకాలజిస్టుగా పని చేస్తున్నారు. ఇక చిన్న కూతురు మాధవి చెన్నైలో సెటిల్‌ అయ్యింది. అయితే పెద్ద కూతురు మీనాక్షి తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి సమయం తీసుకునున్నట్లు సమాచారం.