67 ఏళ్ల వ‌య‌సులో 10వ త‌ర‌గ‌తి..సినిమాల్లో జాతీయ అవార్డు..ఆదర్శమైన నట ప్రయాణం

67 ఏళ్ల వ‌య‌సులో 10వ త‌ర‌గ‌తి..సినిమాల్లో జాతీయ అవార్డు..ఆదర్శమైన నట ప్రయాణం

సక్సెస్..ఈ ఒక్క మాట కోసం అందరు డిగ్రీల మీద డిగ్రీలు చేస్తూ ఉంటారు. పుస్తకాల పురుగుల్లా..నిత్యం చదివేస్తుంటారు. కానీ, కొన్ని సార్లు మనం ఎంత చదివిన సక్సెస్ రాదు. అనుకున్నది సాధించలేము. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా కృంగిపోతాం. ఇక జీవితం ఇంతే అని బాధ పడుతుంటాం. కానీ సక్సెస్ అనే మాట వినాలంటే..చదువు ఒక్కటే మార్గం కాదని నిరూపించిండు ఒక వ్యక్తి.  సినిమా ఇండస్ట్రీలో నాలుగు ద‌శాబ్ధాల ప్రయ‌ణం చేసిండు. కానీ ఇప్పటికీ 10 వ తరగతి పూర్తి చేయలేదు.

అంతేకాదు..ఆయన దాదాపు 400 చిత్రాల్లో నటించిండు..జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ అవార్డులు..రివార్డులు కూడా అందుకుండు. లక్షల్లో తన రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ వెళ్తుండు..ఇప్పటికీ మంచి న‌టుడిగా యాక్టివ్గా ఉన్నాడు. ఇంతకీ ఎవరా నటుడు? 10 వ తరగతి పూర్తి కాకుండానే..కేవలం చిన్నప్పుడు నేర్చుకున్న ఓనమాలతోనే ఇండస్ట్రీలో లెజెండ్గా గుర్తింపు పొందిన ఆ నటుడెవ్వరో తెలుసుకోవాలని ఉందా..?

అతనే మాలీవుడ్ న‌టుడు ఇంద్రాన్స్ (Indrans). ఆయన అసలు పేరు K. సురేంద్రన్. ఇండస్ట్రీకి వచ్చాక..ఇంద్రాన్స్ గా మారిపోయాడు. తన జీవితాన్ని ఒక  కాస్ట్యూమ్ డిజైనర్‌గా మొదలు పెట్టి..స్టార్ యాక్టర్గా రాణిస్తున్నాడు. ఇంతటి  గొప్పదనం..అందరికి ఆదర్శమైన ఇంద్రాన్స్..ఇప్పుడు 10 వ‌త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు? అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా? ఇది కచ్చితంగా న‌మ్మాల్సిన నిజం. 

కేరళ తిరువనంతపురంలోని కుమారపురంలో తండ్రి పలావిల కొచ్చువేలు..తల్లి గోమతి దంపతుల ఏడుగురు సంతానంలో ఇంద్రాన్స్  మూడవవాడు. చిన్నప్పుడే ఆర్దిక ఇబ్బందుల కార‌ణంగా నాల్గ‌వ త‌ర‌గ‌తిలోనే చ‌దువు మానేసారు. చ‌దువులో చాలా తెలివైన వాడు అయినా పేద‌రికం కారణంగా చ‌దువు మ‌ధ్య‌లోనే మానేసి టైలరింగ్ వంటి ప‌నులు చేసి జీవ‌నం సాగించాడు.

అటుపై సినిమా రంగంలో అంచ‌లంచెలుగా ఎదిగారు ఇంద్రాన్స్. సినిమాల ద్వారా కోట్ల ఆస్తి సంపాదించాడు. కానీ ఎందుకో త‌న‌లో చ‌దువు కోవాలి అన్న ఆస‌క్తి మాత్రం ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. దీంతో చ‌దువుకు..పెరుగుతున్న వ‌య‌సుతో సంబంధం లేద‌ని..ఎలాగైనా ప‌ద‌వ త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్ సంపాదించాల‌ని ఆయ‌న ఇప్పుడు క్లాసులకు వెళ్తున్నారు. వ‌చ్చే ఏడాది 2024 లో జ‌రిగే ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి త‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌నుకుంటున్నారు. ఈ 67 ఏళ్ల న‌టుడు ఇంద్రాన్స్ గత నాలుగు దశాబ్దాలుగా 400 చిత్రాల్లో న‌టించి ఎంతో గుర్తింపు పొందారు. 

చదువు రాకుండా `నిరక్షరాస్యుడిగా ఉండటం అనేది అంధుడి` తో స‌మానంగా పోల్చారు. అందువ‌ల్లే తాను ఇప్పుడు మ‌ళ్లీ ప‌ద‌వ‌తర‌గ‌తి క్లాసుల‌కు వెళ్తున్న‌ట్లు తెలిపారు. ఒకేసారి అన్ని ప‌రీక్ష‌లు పాసై ప‌ద‌వ‌త‌ర‌గ‌తి పాసై సర్టిఫికెట్ పొందడం లక్ష్యంగా భావిస్తున్నారు ఇంద్రాన్స్. ప్రస్తుతం ఆయన తన ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం తరగతులకు హాజరవుతున్నారు.

  • Beta
Beta feature