Jagapathi Babu: ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు.. జగపతి బాబు సంచలన ట్వీట్

టాలీవుడ్‌లో వెర్సటైల్‌‌ యాక్టర్‌‌‌‌ జగపతి బాబు(Jagapathi Babu) క్యారెక్టర్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌గా, విలన్‌‌గా సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే.. జగపతి బాబు ఇండస్ట్రీలో మోస్ట్ స్టేట్ ఫార్వర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఏది మాట్లాడిన అందులో ఏదో దాగుంటుంది. అలానే లేటెస్ట్గా పోస్ట్ చేసిన వీడియోకి..'ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. దాంతో జగ్గుభాయ్ పెట్టిన క్యాప్షన్ వెనుక  ఏదో పెద్ద కారణమే ఉందనే చర్చలు కూడా మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన ఐఫా 2024 అవార్డుల కార్యక్రమంలో జగపతి బాబుకు బెస్ట్ విలన్ అవార్డు లభించింది. కన్నడ నాట సూపర్ హిట్ మూవీగా నిలిచిన హీరో దర్శన్ కాటేరా సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాటేరా సినిమాకు గాను ఆయనకు బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ నెగిటివ్ రోల్ అవార్డు లభించింది.

ఈ నేపథ్యంలో ఈ అవార్డు అందుకునేందుకు దుబాయ్ వెళ్లిన జగపతి బాబు అక్కడ రికార్డు చేసిన ఒక వీడియోను షేర్ చేస్తూ 'ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే.. నెటిజన్స్ను పలురకాలుగా ఆలోచింపజేస్తోంది.'సర్ మీరు అద్భుతంగా ఉన్నారు.. మీ చర్యలకు సమాధానం లేదు' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'నువ్వు మాములోడివి కాదు జగ్గుభాయ్'.. 'మంచిగా చేస్తే ఈ సమాజం ఒప్పుకోదు' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ALSO READ | Unstoppable With NBK Promo: బాలచంద్రుల ముచ్చట్లు.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 డైలాగ్స్తో ప్రోమో అదిరింది

ఏదేమైనా జగపతి బాబు స్టయిలే వేరే. ఆ మధ్య ఓ క్యాసినోలో జగపతిబాబు దిగిన ఫొటోను..తనకు తానుగా పోస్ట్ చేస్తూ..'సిగ్గూ శరం లేనివాడినని దిగులు పడను..మీరు చెబితే పడతాను' అనే క్యాప్షన్ తనకు తానే ఇవ్వటం అనేది హైలెట్ గా నిలిచింది. 

ఇకపోతే జగపతి బాబు చాలా ఇంటర్వూస్ లో త‌న కెరీర్ గురించి, తన జీవితంలో అటు పోట్లు, హీరోయిన్స్ గురించి ఓపెన్‌గానే మాట్లాడుతుంటారు. అయితే ఏదీ ఎక్క‌డా లైన్ దాట‌కుండా ఆలోచింప చేసేదిగా మాట్లాడటంలో నెంబర్ వన్ స్టార్ జగపతి బాబు.