‘ఒకే ఒక జీవితం’ నుంచి ప్రమోషనల్‌‌ సాంగ్‌‌

‘ఒకే ఒక జీవితం’ నుంచి ప్రమోషనల్‌‌ సాంగ్‌‌

శర్వానంద్, రీతూవర్మ జంటగా శ్రీ కార్తీక్ రూపొందించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి ఇతర పాత్రలు పోషించారు. ఎస్‌‌.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్‌‌.ఆర్.ప్రభు నిర్మించిన ఈ చిత్రం  సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. నిన్న ప్రమోషనల్‌‌ సాంగ్‌‌ను వదిలారు. 

ఈ పాటను రెండు భాషల్లోనూ తమిళ హీరో కార్తినే పాడి, నటించడం విశేషం. జేక్స్ బిజోయ్ ట్యూన్‌‌ చేశాడు. కృష్ణ చైతన్య తెలుగు లిరిక్స్ రాశాడు. ‘మారిపోయే..లోకమంతా’ అంటూ కార్తి సాంగ్ స్టార్ట్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తోంది. ‘కాలే జారిపడ్డారు ఏమో ఫ్యూచర్‌‌‌‌లోకిలాగా.. కాలం మోసుకొచ్చిందో ఏంటో  ఏమీ తోచక.. ఖాళీ లేని కాలానికే ఇది కాఫీ బ్రేకులే.. కొంచెం చూసినట్టయిన లేదే అన్నీ వింతలే’ అంటూ సాగిన ఈ పాట వినడానికి, చూడటానికి కూడా ఇంటరెస్టింగ్‌‌గా ఉంది.