ప్రధాని మోడీపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్

 ప్రధాని మోడీపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్

నటుడు మాధవన్, ప్రధాని మోడీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న మాధవన్.. మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.  మోడీ ఆధ్వర్యంలో దేశంలో మైక్రో ఎకానమీ సాధించిన విజయాన్ని మాధవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో, ఆన్ లైన్లో బ్యాంకు అకౌంట్లను ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియని రోజుల్లో.. డిజిటలైజేషన్ అనే ప్రక్రియను పెద్ద విపత్తుగా భావించారని అన్నారు. కానీ గడిచిన రెండేళ్లలో సీన్ మారిపోయిందన్నారు.

డిజిటల్ పేమెంట్స్ ను అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్న వినియోగదారుల జాబితాలో భారత్ కూడా చేరిందని తెలిపారు. ఇప్పుడు రైతులు స్మార్ట్ ఫోన్ వాడాలన్నా, తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోవాలన్నా చదువుకోవాల్సిన అవసరం లేదని మాధవన్ అన్నారు. మాధవన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ షేర్ చేశారు. కేన్స్‌లో భారత ప్రతినిధి బృందానికి  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేనాయకత్వం వహిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్

పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త..