సూపర్ స్టార్ కృష్ణకు మహేశ్ బర్త్ డే విషెస్

 సూపర్ స్టార్ కృష్ణకు మహేశ్ బర్త్ డే విషెస్

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతమైన సంచనాలు సృష్టించిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసి, అందనంత ఎత్తుకు ఎదిగారు. తన సహజ నటనతో, హావ భావాలతో అందర్నీ ఆకట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నో సాహస చిత్రాలను చేసి.. వినూత్న ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు సూపర్ స్టార్ కృష్ణ. వెండితెరపై కౌ బాయ్ గా అలరించినా, కుర్రాడిలా చిందేసినా, వీరునిలా పోరాడినా, పెద్ద మనిషిలా తీర్పు చెప్పినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి గొప్ప నటుడు నేడు 79వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా..! మీలాంటి వారు నిజంగా ఎవరూ ఉండరు. రాబోయే  రోజుల్లో మీరు ఇంకా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ..' అని మహేశ్ ట్వీట్ చేశారు.

 

మరిన్ని వార్తల కోసం..

ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం

మరో రికార్డు సృష్టించిన హ్యూమన్ కాలిక్యులేటర్‌