విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?

‘మా’ ఎన్నికలపై సినీనటుడు నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. ప్రకాశ్ రాజ్‎కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవని ఆయన అన్నారు. మంచు విష్ణు ఇప్పటివరకు పాతిక సినిమాల్లో నటిస్తే.. ప్రకాశ్ రాజ్ పాతికేళ్ల నుంచి సంవత్సరానికి పాతిక సినిమాల్లో నటిస్తున్నాడని నాగబాబు అన్నారు. నటీనటులకు ఏంకావాలో ప్రకాశ్ రాజ్‎కే తెలుసని ఆయన అన్నారు. ‘మా’ ఎన్నికలపై జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ నాగబాబు మీడియాతో మాట్లాడారు.

‘దేశ ప్రధానితో పోరాటం చేసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్‎తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలి. ఎందుకంటే విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు. అదేవిధంగా నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్‎కే తెలుసు. నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్‎కే కాదు.. మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉన్నాయి. ‘సలీం’ చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అధోగతి పట్టించారు. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారు. మీ వివాదాల్లో తప్పెవరిదో మాకు తెలియదు. అలాగే ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరిదో మీకు తెలియదు. మంచు విష్ణు ఇప్పటివరకూ పాతిక సినిమాల్లో నటిస్తే.. ప్రకాశ్ రాజ్ పాతికేళ్ల నుంచి సంవత్సరానికి పాతిక సినిమాల్లో నటిస్తున్నాడు. నాన్ లోకల్ అంటున్న ప్రకాశ్ రాజ్‎కు ‘మా’ లో సభ్యత్వం ఎందుకు ఇచ్చారు? ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరుకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుంది. మిమ్మల్ని గెలిపించడానికి పనికొచ్చే ప్రకాశ్ రాజ్.. గెలవడానికి పనికిరాడా? మంచు విష్ణు లాంటాడో గెలిస్తే అసోసియేషన్ పరిస్థితి ఏంటీ? తెలుగు సినిమా మనది అనుకునేవాన్ని వేరు చేయడం మానవత్వమా? తెలుగు సినిమాతో ఆయనకున్న పాతికేళ్ల భాగస్వామ్యాన్ని వేరు చేస్తున్నారు. మన తెలుగు నటులు 60 ఏళ్లు మద్రాసులో ఉన్నప్పుడు మనల్ని నాన్ లోకల్ అంటే తెలుగు సినిమా ఇప్పుడు ఇలా ఉండేదా?

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్. మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే.. విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు. ప్రకాశ్ రాజ్‎ని తెలుగోడంటారు, అదే విష్ణును తెలుగు నేర్చుకోమంటారు. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్‎కే నా మద్దతు’ అని స్పష్టం చేశారు.

 
Mr. Manchu Vishnu even you are a non local

Every MAA association memeber kindly go through the details which I mentiond in the video and do vote to the PRAKASH RAJ Panel

Posted by Naga Babu on Friday, October 8, 2021

For More News..

పెట్రోల్‎తో పాటు డీజిల్ ధరలు పైపైకి.. వరుసగా ఐదో రోజు పెంపు

లఖీంపూర్ అప్డేట్: విచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా

పిల్లి పోయిందని పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు