పక్కా యాక్షన్‌లోకి దిగుతున్న నాగార్జున

పక్కా యాక్షన్‌లోకి దిగుతున్న నాగార్జున

కొత్త కథల్ని ఎంచుకుంటారు. కొత్త రకాల పాత్రల్ని పండించడానికి ఇష్టపడుతుంటారు. ఆ క్యారెక్టర్స్‌‌ కోసం కొత్త లుక్కులోకీ మారిపోతుంటారు. అందుకే నాగార్జున సినిమాలన్నీ ప్రేక్షకులకు కొత్త ఫీల్‌‌ని కలిగిస్తుంటాయి. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌‌లో తెరకెక్కుతున్న మూవీ కూడా అలానే ఉంటుందట. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ షూటింగ్‌‌ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఆల్రెడీ గోవాలో ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. రేపటి నుంచి హైదరాబాద్‌‌లో సెకెండ్ షెడ్యూల్‌‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఇండియాలోని మెయిన్ సిటీస్‌‌తో పాటు విదేశాల్లోనూ షూట్ చేసేలా ప్లాన్ చేశారట. నాగార్జున కంప్లీట్‌‌గా యాక్షన్ ప్యాక్డ్ లుక్‌‌లో కనిపించనున్నారని చెబుతోంది టీమ్. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. గుల్ పనాగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేశ్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇదిలా ఉంటే నాగ్ నెక్స్ట్ మూవీ ‘బంగార్రాజు’ని కూడా  పట్టాలెక్కించేందుకు  ప్లాన్ రెడీ అయ్యింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’కి ప్రీక్వెల్‌‌గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్‌‌ ఆగస్ట్ నెలాఖరున మొదలు కానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం హైదరాబాద్‌‌లో ఓ స్పెషల్ సెట్ కూడా వేశారట. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతీశెట్టి కనిపించనున్నారు. ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ కురసాల 
దర్శకుడు.