రెండేళ్లలో ప్యాన్ ఇండియా మాటే వినబడదు

రెండేళ్లలో ప్యాన్ ఇండియా మాటే వినబడదు

ప్రతి సినిమాకీ తనను తాను రీ ఇన్వెంట్ చేసుకోడానికి ట్రై చేస్తున్నానంటున్నాడు నాని. శివ నిర్వాణ డైరెక్షన్‌‌‌‌లో తను నటించిన ‘టక్ జగదీష్’ ఈరోజు అమెజాన్ ప్రైమ్‌‌‌‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని ఇలా ముచ్చటించాడు.

  • శివ కథ చెబుతాననే టైమ్‌‌‌‌కి లవ్ స్టోరీస్ చేసే స్థితిలో లేను. అందుకే నో చెప్పేద్దామనుకున్నాను. కానీ భూదేవిపురం కథ చెప్పాడు. ‘మగపిల్లాడు ఏడవకూడదు, ఆడపిల్లను ఏడిపించకూడదు. అది ఇంటికి, ఊరికి మంచిది కాదు’ అంటూ ఓపెనింగ్ సీన్ చెప్పగానే డెప్త్ ఉన్న స్టోరీ అనిపించింది. 
  • ‘తను ఏడిస్తే మనకి ఏడవాలని, తను నవ్వితే మనకు నవ్వాలనిపించేవాడే నటుడు’ అని నా చిన్నప్పుడు మా నాన్నవాళ్లు అన్న మాట ఇప్పటికీ మైండ్‌‌‌‌లోనే తిరుగుతోంది. ఫన్ సినిమా చేసిన ప్రతిసారీ హిట్ వచ్చింది. కానీ నటనంటే అదొక్కటే కాదుగా. అన్ని రకాల సినిమాలు చేస్తూ నన్ను నేను టెస్ట్ చేసుకోవాలిగా. అందుకే నన్ను ఎక్సయిట్‌‌‌‌ చేసిన సినిమాలే చేస్తున్నాను. ప్రతి సినిమాకీ నన్ను నేను రీ ఇన్వెంట్ చేసుకోడానికి ట్రై చేస్తున్నా. 
  • ‘వి’ డబుల్ సక్సెస్ అని అమెజాన్ వాళ్లు చెప్పారు. అమ్మిన నిర్మాత కూడా హ్యాపీ. కానీ ‘వి’ ఎందుకు నిరాశపర్చిందనే ప్రశ్న మరో పది సినిమాల వరకు నాకు ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అని చెప్పుకునేందుకు ఓటీటీలో కలెక్షన్ల డిటెయిల్స్‌‌‌‌ లేవు. కానీ అదే అమెజాన్ సంస్థ ‘వి’కి మించిన ఆఫర్ ఇచ్చి ‘టక్ జగదీష్’ కొన్నారంటే అది వర్కవుట్ అయినట్టే కదా! 
  • నా ఉద్దేశంలో మరో రెండేళ్లలో ప్యాన్ ఇండియా అనే మాటే వినపడదు. ఓటీటీ ద్వారా మనకు ఏమాత్రం తెలియని భాషల్లోని సినిమాలను సబ్ టైటిల్స్‌‌‌‌తో చూడటం అలవాటైంది. దీంతో మరో రెండేళ్లలో అందరూ ఒరిజినల్ లాంగ్వేజ్‌‌‌‌లో చూడటానికే ఇష్టపడతారు. అప్పుడిక ప్యాన్ ఇండియా ఉండదు.
  • సక్సెస్ అవుతుందనే నమ్మకం కలిగినా, నేనున్న ఫేజ్‌‌‌‌లో నాకు సెట్ కావని వదిలేసిన చిత్రాలున్నాయి. ‘రాజారాణి’ కథ వినేటప్పటికి నా చేతిలో రెండు సినిమాలున్నాయి. ఏడాది పాటు అట్లీని ఆపడం ఇష్టంలేక వేరే వారితో ప్రొసీడవమన్నాను. 
  • అన్నీ అనుకూలిస్తే ఇయర్ ఎండింగ్​లో ‘శ్యామ్ సింగ రాయ్’ వస్తుంది. ‘అంటే సుందరానికి’ థర్డ్ షెడ్యూల్ జరుగుతోంది. కామెడీ మూవీ. ఫస్ట్ లుక్ చూసే షాకవుతారు. వెబ్ సిరీసులు చేసే ఆలోచన లేదు. ఎందుకంటే ఇంటర్వెల్, క్లైమాక్స్‌‌‌‌తో సినిమా చూడటమే నాకిష్టం. 
  • ‘హిట్ 2’ డెబ్భై శాతం పూర్తయింది. ఆ ప్రాంచైజీలో వరుస సినిమాలు చేయాలనుకుంటున్నాం. ‘మీట్ క్యూట్’ పూర్తయింది. డిజిటల్‌‌‌‌ రిలీజ్ అనుకుంటున్నాం. అంత బ్యూటిఫుల్ రైటర్ మా ఇంట్లోనే అక్క రూపంలో ఉందని తెలీదు. 
  • భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం లాంటి రీమేక్స్‌‌‌‌లో నటించాను. కానీ జెన్యూన్‌‌‌‌గా కొత్త కథల్ని ఎక్స్‌‌‌‌ప్లోర్‌‌‌‌‌‌‌‌ చేద్దామనే ఆలోచనకి, రీమేక్స్‌‌‌‌కి మ్యాచ్ అవడం లేదు. అందుకే రీమేక్స్ చేయకూడదని ఫిక్సయ్యాను. మన సినిమాలే మరో భాషల్లో రీమేక్ అవ్వాలి. ఇప్పటికే జెర్సీ, నిన్నుకోరి, హిట్, అ..! లాంటి నేను చేసిన సినిమాలు  రీమేక్ అవుతున్నాయి. ‘టక్ జగదీష్’ తెలుగు వారి కథ. కాబట్టి వేరే భాషల్లో రీమేక్‌‌‌‌కి సెట్ కాక పోవచ్చు.