
టాలీవుడ్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వివాహం..తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరు పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో...అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన పెళ్లి వీడియోను నరేష్ శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక పవిత్ర బంధం....రెండు మనసులు....మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. కొత్త ప్రయాణం ప్రారంభించాం. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం..అంటూ పెళ్లి వీడియో షేర్ చేశారు. ఈ కొత్త జంటకు కొందరు శుభాకాంక్షలు చెబుతుంటే..మరి కొందరు..ఇది రియల్ పెళ్లికాదు..రీల్ పెళ్లి అని కొట్టిపారేస్తున్నారు.
స్పందించిన నరేష్..
తన పెళ్లి వార్తలపై నటుడు నరేష్ స్పందించాడు. "ఇంటింటి రామాయణం" సినిమా ప్రెస్ మీట్లో నరేష్ పాల్గొన్నారు. ఈ సమయంలో తన పెళ్లిపై నరేష్ను మీడియా ప్రశ్నించింది. సమాధానం దాటవేసిన వేసిన నరేష్..మూవీ గురించే మాట్లాడదామని చెప్పారు. ఆ తర్వాత ఓ రిపోర్టర్.. మరోసారి అదే ప్రశ్న అడిగాడు. ప్రభాస్, సల్మాన్ ఖాన్‌ల పెళ్లి కంటే మీ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది...ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు..? ఎప్పుడు పెళ్లి భోజనం పెట్టబోతున్నారని ప్రశ్నించాడు. దీనిపై రియాక్ట్ అయిన నరేష్..తన పెళ్లికి సంబంధించి త్వరలోనే ఓ ప్రెస్‌మీట్ పెడతానని చెప్పాడు. రీల్ లైఫ్, రియల్ లైఫ్‌కి తేడా ఉంటుందన్నారు. తన లైఫ్‌ని తాను జీవిస్తున్నానని... ఈ ప్రెస్ మీట్‌ని మరో విధంగా డైవర్ట్ చేయదలుచుకోవడం లేదని నరేష్ తెలిపారు.
నటుడు నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మూడో భార్య రమ్య రఘుపతి విడాకుల వ్యవహరం ఇంకా కోర్టులోనే ఉంది. మరోవైపు పవిత్రకు కూడా ఇదివరకే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. అయితే సమ్మోహనం మూవీ సమయంలో పవిత్ర-నరేశ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ పై వార్తలు వచ్చాయి. దీంతో న్యూ ఇయర్ సందర్భంగా తమ రిలేషన్‌పై నరేశ్ అధికారిక ప్రకటన చేశారు.