మనీలాండరింగ్ కేసు.. ఫ‌తేహీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

మనీలాండరింగ్ కేసు.. ఫ‌తేహీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

జైలులో ఉన్న క్యాన్ మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న ₹ 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహీని నేడు ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం జరిపిన ఈ విచారణ నాలుగు గంటల పాటు జరిగింది. మనీ లాండరింగ్ పై అనుమానంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలోనూ సుకేష్ చందశేఖర్, ఎంఎస్ ఫతేహీలను ప్రశ్నించింది. ఈ విచారణలో డిసెంబర్ 12, 2020 కంటే ముందెప్పుడూ కాన్‌మ్యాన్‌తో మాట్లాడలేదని ఎంఎస్ ఫతేహీ అన్నారు. ఆ ఈవెంట్ కు ముందు రెండు వారాల ముందు మాత్రమే తనతో మాట్లాడినట్టు చెప్పారు.

ఇక ఫతేహీకి లగ్జరీ కారు బీఎమ్‌డబ్ల్యూ కారు ఇచ్చారని గతంలో సుకేశ్ చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా.. మొదటగా సుకేష్ కారు ఆఫర్ చేసినపుడు ఓకే అని చెప్పినా.. ఆ తర్వాత తనకు అది అవసరం లేదని చెప్పినట్టు ఫతేహీ స్పష్టం చేశారు. ఈ విషయం బాబీ ఖాన్ కు తెలియజేశానని, అవకాశముంటే ఆ కారును అతనికి ఇవ్వమని చెప్పానన్నారు. అయితే ఈ సందర్భంగా సుకేశ్ స్పందిస్తూ.. అతను కేవలం  ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమేనని, తాను ఫతేహీకి మాత్రమే ఈ కారును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని సుకేశ్ చెప్పినట్టు ఫతేహీ తెలిపారు. 

లగ్జరీ బ్యాగ్‌ల వంటి ఖరీదైన బహుమతులు తమ మధ్య మార్పిడి జరిగిందా అని దర్యాప్తు సంస్థ ప్రశ్నించిగా... Ms ఫతేహీ మాట్లాడుతూ.. అది ఎప్పుడూ జరగలేదని, తాను ఓ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న సమయంలో బహిరంగంగానే గూచీ బ్యాగ్, ఐఫోన్ 12 బహుమతిగా ఇచ్చారని పేర్కొంది. ఇక ఈ విచారణలో ఆమెను ఢిల్లీ పోలీసులు దాదాపుగా 50 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పలు దోపిడీ కేసుల్లో రూ.200 కోట్లు కొట్టేసినట్టుగా ఆరోపిణలు ఎదుర్కొంటున్న సుకేశ్, అతని భార్య లీనా పాల్ లపై ఢిల్లీ పోలీసులు అప్పట్లో అఫెన్స్ వింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు సెలబ్రెటీలను నిందితులుగా పేర్కొంటూ సుకేశ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నోరా ఫ‌తేహీతో పాటు ఇత‌ర సెల‌బ్రిటీలు సైతం సుకేశ్ నుంచి ఖ‌రీదైన గిఫ్ట్‌లు తీసుకున్నట్లు ఫెర్నాండేజ్ ఆరోపించారు.