
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పవన్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన తన ఫాంహౌజ్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పవన్.. గురువారం కరోనా టెస్ట్ చేయించున్నారు. ఆ పరీక్షల్లో పవన్‌కు కరోనా సోకినట్లు తేలింది. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న పవన్.. హైదరాబాద్ చేరుకున్న తర్వాత కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో నెగిటివ్ వచ్చినప్పటికీ.. డాక్టర్ల సూచన మేరకు ఆయన తన ఫాంహౌజ్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లారు. రెండు రోజుల కిందట పవన్‌కు జ్వరం రావడంతో వైద్యులు మరోసారి కరోనా పరీక్షలు చేయగా.. అందులో పవన్‌కు కరోనా సోకినట్లు తేలింది. పవన్ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులు వాడుతున్నారు. ప్రస్తుతం పవన్ తన ఫాంహౌజ్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. పవన్ ఆరోగ్యం గురించి ఆయన అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ, రాంచరణ్, ఉపాసనలు డాక్టర్లతో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2021
ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స pic.twitter.com/089nooZUlV