వాళ్ళు జై భీమ్ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రకాష్ రాజ్ షాకింగ్ ట్వీట్

వాళ్ళు జై భీమ్ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రకాష్ రాజ్ షాకింగ్ ట్వీట్

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్(Jai bheem) చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవడంపై చాలా మంది ప్రముఖులు ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల నేచురల్ స్టార్ నాని(Nani) జై భీమ్ చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ లిస్టులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash raj) కూడా చేరిపోయారు. జై భీమ్ చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవడాన్ని తనదైన శైలీలో తప్పుబట్టారు.    

‘‘ఎవరైతే గాంధీని చంపిన హంతకుడిని సపోర్ట్ చేస్తారో, ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారో..  వాళ్ళు జై భీమ్ ను ఎలా  సెలబ్రేట్ చేసుకుంటారుని ప్రశ్నించారు. అంతేకాదు.. ఓ మరాఠి పద్యాన్ని కూడా షేర్ చేశారు ప్రకాష్ రాజ్. జై భీమ్ అంటే వెలుగు, జై భీమ్ అంటే ప్రేమ, జై భీమ్ అంటే చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం, జై భీమ్ అంటే లక్షల మంది కన్నీళ్లు అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఆయన్ని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక 69వ జాతియా అవార్డ్స్ లో తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. దీనిపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. జై భీమ్ కు కాకుండా పుష్ప సినిమా అవార్డు ఎలా ఇస్తారంటూ కామెంట్స్ చేశారు.