చేసిందేమీ లేదు.. అంతా సున్నా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

చేసిందేమీ లేదు.. అంతా సున్నా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నటుడు ప్రకాష్ రాజ్(Prakash raj) మా ప్రెసిడెంట్ మంచి విష్ణు(Manchu Vishnu)పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మా ప్రెసిడెంట్ అయ్యి రెండుళ్లు అవుతున్నా.. ఆయన చేసిందేమీ లేదని, పనితీరు సున్నా అని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇంతకీ అసలువిషయం ఏంటంటే.. రెండేళ్ల క్రితం మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ఘోరంగా ఓడిపోయారు ప్రకాష్ రాజ్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజేమే కానీ.. మా ప్రెసిడెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అడిగే హక్కు తమకుందని, ఏరోజైనా నిలదీస్తామని అన్నారు. 

రెండేళ్ల క్రితం చెప్పినట్టుగానే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు పై ఫైర్ అయ్యాడు ప్రకాష్ రాజ్. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలిచి రెండేళ్లు అయిపోయాయి కానీ.. ఇప్పటివరకు ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించలేదు. మా బిల్డింగ్ కూడా పూర్తికాలేదు. ఆయనను ప్రెసిండెంట్ గా ఎన్నుకున్న సభ్యులు ఇప్పుడు ఆలోచించాలి. బోగస్ ఓట్లు, చాలా మంది బయటి నుంచి వచ్చి ఓట్లు వేయడం వల్ల ఆయన  గెలిచాడు తప్పా.. ఈ రెండేళ్లలో ఆయన చేసిందేమీ లేదు.. సున్నా.. అని చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read :- షూటింగ్లో ప్రమాదం.. లారీపై నుండి పడిపోయిన విశ్వక్ సేన్