షూటింగ్లో ప్రమాదం.. లారీపై నుండి పడిపోయిన విశ్వక్ సేన్

షూటింగ్లో ప్రమాదం.. లారీపై నుండి పడిపోయిన విశ్వక్ సేన్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్(Vishwak Sen) కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari) అనే సినిమాలో నటిస్తున్న  విషయం తెలిసిందే. సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లారీ పైనుండి పడిపోయారు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో విశ్వక్ సేన్ కు ఏమైనా గాయాలయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది.   

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే.. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను  కృష్ణచైతన్య(Krishna Chaitanya) తెరకెక్కిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి(Neha Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి(Anjali) కీ రోల్ చేస్తున్నారు. షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja) సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

Also Read :- చేసిందేమీ లేదు.. అంతా సున్నా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్