Priyadarshi: కామన్ మ్యాన్ కథలతో హీరో ప్రియదర్శి.. ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’ సక్సెస్‌‌‌‌‌‌‌‌తో వరుస సినిమాలు

Priyadarshi: కామన్ మ్యాన్ కథలతో హీరో ప్రియదర్శి.. ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’ సక్సెస్‌‌‌‌‌‌‌‌తో వరుస సినిమాలు

రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’చిత్రంతో సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుని ఫుల్ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  ప్రియదర్శి.. ఇప్పుడు  ‘సారంగపాణి జాతకం’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో  శివలెంక కృష్ణప్రసాద్  నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి చెప్పిన విశేషాలు.

‘‘జాతకాల బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ సినిమా ఇది. అలాగని జాతకాలు నమ్మాలి, నమ్మకూడదు అని చెప్పలేదు.  కానీ ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించాం. ఇంతవరకు నేను ఎక్కువగా తెలంగాణ యాస మాట్లాడే  పాత్రలే చేశా. కానీ ఈ సారి మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడతా.

దర్శకుడు ఇంద్రగంటి గారు నా కోసం ఇందులో సపరేట్ ట్రాక్, టైమింగ్‌‌‌‌‌‌‌‌ను సెట్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయనతో ఒక ఫోటో దిగితే చాలని అనుకునేవాడ్ని. కానీ ఆయన డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నటించడం బ్లెస్డ్‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్నా. ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మరోవైపు శివలెంక కృష్ణ ప్రసాద్ గారు చాలా గొప్ప నిర్మాత. ‘ఆదిత్య 369‘లాంటి గొప్ప చిత్రాలను నిర్మించిన సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాత అయినప్పటికీ నాలాంటి కొత్త యాక్టర్‌‌‌‌‌‌‌‌లని కూడా సర్ అని పిలుస్తుంటారు. ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.

ఇక ప్రస్తుతం జనాలు కంటెంట్ ఉన్న చిత్రాల్నే ఎంకరేజ్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ కథల్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి పాత్రలు ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా నమ్మకం. వారి జర్నీ చాలా పెయిన్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.

మల్లేశం, బలగం, కోర్ట్, సారంగపాణి  లాంటి కథలన్నీ కామన్ మ్యాన్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చినవే. ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’ సినిమా ఓటీటీలో టాప్‌‌‌‌‌‌‌‌ ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. అందుకు కారణం ప్రేక్షకులకు అలాంటి చిత్రాలు నచ్చుతున్నాయి. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి చాలా విషయాలు ప్రేక్షకుల నుంచే నేర్చుకుంటున్నా.

ప్రస్తుతం ఏషియన్ సినిమాస్‌‌‌‌‌‌‌‌లో ‘ప్రేమంటే‘అనే సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నా.  గీతా ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌లో బన్నీ వాస్ గారి నిర్మాణంలో ‘మిత్రమండలి‘అనే మరో ప్రాజెక్టు చేస్తున్నా. ఇంకా కొన్ని కథలు వింటున్నా.  బలమైన పాత్రలుండే సినిమాల్ని ఎక్కువగా చేయాలని అనుకుంటున్నా’’అని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.