
హీరో రాజశేఖర్ ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వరదరాజన్.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో హీరో రాజశేఖర్ రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.