టూమచ్ అరాచకం : ప్రముఖ హీరో, నిర్మాతను కొట్టి చంపిన ఆందోళనకారులు

టూమచ్ అరాచకం : ప్రముఖ హీరో, నిర్మాతను కొట్టి చంపిన ఆందోళనకారులు

బాంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఎలా మారిందో చూస్తున్నాం. నిరసనకారుల హింసాకాండలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో పోలీసులతో సహా దాదాపు వందల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేశం మొత్తం మీద నిరవధికంగా దాడులు మొదలయ్యాయి. 

తాజాగా ఈ పరిణామంలో బాంగ్లాదేశ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నిర్మాత సలీమ్ ఖాన్, అతని కొడుకు హీరో శాంటో ఖాన్ ను ఆందోళనకారులు దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశారు.అక్కడి బాలియా యూనియన్ లోని ఫరక్కాబాద్ మార్కెట్ సమీపంలో ఈ తండ్రికొడుకులపై దాడి జరిగింది. ఆందోళనకారులు మొదట తుపాకులతో బెదిరించి చంపడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఏదో విధంగా వారి నుంచి ఈ తండ్రికొడుకులు తప్పించుకున్నా, తిరిగి బగారా మార్కెట్ యందు దొరికించుకుని దారుణంగా కొట్టి చంపారు. కాగా సినిమాకి సంబంధించిన వ్యక్తులను అతి తీవ్రంగా కొట్టి చంపడంతో..బంగ్లా సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 

హీరో శాంటో ఖాన్ సినిమాల విషయానికి వస్తే..బాబూజాన్, అంటో నగర్, బిక్కోవ్, తుంగిపరా'ర్ మియా భాయ్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇక తండ్రి సలీం ఖాన్ 10కి పైగా సినిమాలను నిర్మించారు.