
టాలీవుడ్ నటుడు శివాజీ(Shivaji) షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ఇప్పుడే చచ్చిపోతా అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు బిగ్ బాస్(Bigg boss) అండ్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు శివాజీ. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన #90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ సక్సెస్ లో భాగంగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శివాజీ.
ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉండాలి. డబ్బు శాశ్వతం కాదు. బయట నాపై చాలా కామెంట్స్ విపిస్తూ ఉంటాయి. అవన్నీ నేను పట్టించుకోను. రాజకీయాల్లోకి వెళ్లి బాగా సంపాదించానని అంటారు. ఆలా అని ఒక్క ప్రూఫ్ చూపించినా నేను ఇప్పుడే చచ్చిపోతా. చొక్కా ప్యాంట్ తో నేను ఇండస్ట్రీకి వచ్చినోడిని. నాకు ఎందులోనూ రిగ్రెట్స్ లేవు. నాకు నా క్యారెక్టర్ ముఖ్యం అంటూ ఫైర్ అయ్యారు.
ఇంకా బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడిన శివాజీ.. 12వ వారం వరకు నేను టైటిల్ రేసులో ఉన్నాను. ఆ తర్వాతే ఏదో జరిగింది. నన్ను నెగిటివ్ చేసేలా కొన్ని ఎపిసోడ్స్ వచ్చాయి. ఇక అమర్ పై చేసిన కామెంట్స్ గురించి చెప్పాలంటే.. అది మా ఇద్దరి మధ్య ఉన్న చనువు.. అంటూ చెప్పుకొచ్చాడు శివాజి. ప్రస్తుతం శివాజీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.