పరిచయం..నటించాలని గట్టిగ అనుకున్న

పరిచయం..నటించాలని గట్టిగ అనుకున్న

నిజానికి ఒక సినిమా లేదా సిరీస్​లో బాగా నటించిన ఇద్దరుముగ్గుర్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు. కానీ హీరామండీ వెబ్​సిరీస్​లో నటించిన వాళ్లలో మెయిన్​లీడ్స్​ అందర్నీ గుర్తు పెట్టుకుని మరీ ప్రశంసిస్తున్నారు. ఆ మెయిన్​ లీడ్స్​లో ఒకరు శృతి శర్మ. అంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్న సిరీస్​లో పనిమనిషి క్యారెక్టర్​ చేసిన ఈ అమ్మాయి గురించి నెట్టింట తెగ వెతుకుతున్నారు. మరి అందరి దృష్టిని అంతగా ఆకట్టుకున్న ఈమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలతోపాటు హీరామండీ ఎక్స్​పీరియెన్స్​ గురించి ఆమె మాటల్లో.

‘‘నా చదువంతా లక్నోలో జరిగింది. కాలేజీ డేస్​లో చాలా స్టేజీ డ్రామాల్లో నటించా. ‘అనుపమ్​ ఖేర్​ యాక్టింగ్ స్కూల్లో’ డిప్లొమా చేశా. ఫ్లిప్​ కార్ట్,  అమెజాన్​ వంటి వెబ్​సైట్​లలో మోడల్​గా కెరీర్​ స్టార్ట్ చేశా. వెబ్ సిరీస్​లు, షార్ట్​ ఫిల్మ్స్​లో నటించా. ముంబై, ఢిల్లీ అంత పెద్ద సిటీ కాదు లక్నో. కానీ, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర రాజధాని. మా దగ్గర చాలామందికి క్రియేటివ్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ, అనుకున్నది చేయాలంటే మాత్రం చాలా చర్చోపచర్చలు జరుగుతాయి. నా విషయంలో మానాన్నను ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే సాధారణంగా చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది.

పైగా నేను ముంబయి వెళ్లిపోతే అక్కడ నన్ను చూసుకునే వాళ్లు ఎవరూ ఉండరు. అందుకని మా నాన్న ఆ విషయంలో చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఎలాగో అమ్మానాన్నలకి నామీద నమ్మకం వచ్చింది. లక్నోలో ఉన్నప్పుడు రాయడం, డైరెక్షన్​, యాక్టింగ్ చేసి ప్రూవ్ చేసుకున్నా. యాక్టింగ్​ ప్రొఫెషన్​లోకి వెళ్లాలని నేను గట్టిగా అనుకుంటున్నా అనే విషయం నాన్నకు అర్థమై అప్పుడు ‘ఓకే’ అన్నారు. 

టీవీ కెరీర్​ 

మొదటిసారి 2018లో యూట్యూబ్​ వెబ్ సిరీస్​ ‘బ్లాక్​ బస్టర్​ జిందగీ’లో నటించా. అదే ఏడాది ‘ఇండియాస్ నెక్స్ట్​ సూపర్ స్టార్’ అనే రియాలిటీ షోలో పాల్గొన్నా. అలాగే ‘మై హువా తేరా’ మ్యూజిక్ వీడియోలో కూడా యాక్ట్ చేశా. అప్పుడు మొదటిసారి నేషనల్ ఛానెల్​లో నేను కనిపించా. అది నాకు బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత 2019లో ‘గట్​ ​బంధన్​’ అనే సీరియల్​లో నటించే ఛాన్స్​ వచ్చింది. అందులో నాది ఐపిఎస్​ రోల్. ​ఆ సీరియల్​కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత ఏడాది 2020లో ‘నజర్​ – 2’ సిరీస్​లో లీడ్​ రోల్​ చేశా. కానీ కొవిడ్ ప్యాండెమిక్​ వల్ల ఆగిపోయింది. 

తొలి అడుగు తెలుగులో...

నేను ఒక షోలో చార్లీ చాప్లిన్ లాగ యాక్ట్​ చేశా. దాన్ని దాంతో పాటు మరో కామెడీ యాక్ట్ చూసి ‘ఏజెంట్​సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా డైరెక్టర్​ నన్ను కలిశారు. తెలుగులో డైలాగ్స్ చెప్పడం కొంచెం కష్టం. తెలుగు నేర్చుకోవడం కోసం వర్క్​షాప్స్​కి వెళ్లా. ఆ సినిమా రిలీజ్​ అయి మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగులోనే కాదు సినిమాల్లో ఎంటర్​ కావడమే అది నా మొదటి అడుగు. నా మొదటి ప్రయత్నానికి పబ్లిక్ నుంచి అంత ఎంకరేజ్​మెంట్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. తెలుగులో అవకాశం వస్తే మిస్​ కాను. డిఫరెంట్​ లాంగ్వేజెస్​లో నటించాలి అని ఉంది. యాక్టర్​కి భాష అనేది​ అడ్డుగోడ కాదు. దాని తర్వాత హిందీలో 2021లో సాన్యా మల్హోత్ర నటించిన ‘పగ్లాయత్’​ అనే వెబ్​సిరీస్​ ద్వారా ఎంట్రీ ఇచ్చా. అందులో నా రోల్​ పేరు నజియా. ఇలా మరికొన్ని ప్రాజెక్ట్‌‌ చేశా. 

...ఎక్కడైనా యాక్టరే

యాక్టర్​ అంటే యాక్టరే. ఏ మీడియంలో పని చేస్తున్నారనేది ముఖ్యం కాదు. అలాంటి తేడాలు చూపించకూడదు. నేను నాలుగేండ్లు టెలివిజన్​లో పనిచేశా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అదే యాక్టింగ్ చేస్తున్నా. నిజానికి ఇక్కడ డిఫరెంట్​గా ఏం చేయట్లేదు. టీవీ నాకు చాలా నేర్పించింది. ఉన్నట్టుండి ఒక లైన్ లేదా డైలాగ్​ చెప్తే దాన్నెలా చెప్పాలి వంటి ఎన్నో విషయాలు తెలిశాయి నాకు. అది నాకు హీరామండిలో చేసేటప్పుడు చాలా బాగా పనికొచ్చింది. ఎందుకంటే స్పాంటెనిటీ ఉన్న యాక్టర్స్​ని ఇష్టపడతారు సంజయ్​లీలా భన్సాలీ. నేనేం చేయబోతున్నానో మైండ్​లో ముందే ప్రిపేర్​ అవుతా. కాకపోతే సినిమాతో పోలిస్తే టీవీలో నటించడం ఒక్క చోట మాత్రమే కష్టంగా అనిపిస్తుంది.

టీవీ కోసం ప్రతి రోజూ ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోలర్ కోస్టర్ రైడ్​లా ఉంటుంది. హ్యాపీనెస్​ ఉంటుంది. ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. నేను హీరామండీ చేశాక టీవీ ఇండస్ట్రీలో చాలామంది నన్ను చూసి గర్వపడుతున్నాం అని చెప్పారు. అలా ప్రతి ఒక్కరు నా మీద ప్రశంసలు కురిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

మొదటి సీన్​లో భయపడ్డా​

కెమెరా ముందుకు వచ్చి సీన్ చేయమని చెప్పారు డైరెక్టర్. నేను చాలా నెర్వస్ ఫీలయ్యా. ఆ భయంలో డైలాగ్ కూడా అలానే చెప్పా. అప్పుడు ‘సైమా భయపడొద్దు. బాగా చెయ్’ అన్నారు సంజయ్​. ‘సరే’ అని పనిమొదలుపెట్టా. ఆ తరువాత ఎక్కువ టేక్​లు తీసుకోలేదు. మామూలుగా కూడా డైరెక్టర్​కి ఒకటి రెండు టేక్స్​లోనే  నా నటన నచ్చుతుంది. హీరామండీలోనే మరో సీన్ చేసేటప్పుడు ఇంకో ఇబ్బంది ఎదురైంది. అది ఒక రొమాంటిక్ సీన్. ఎండు గడ్డి మీద పడుకోవాలి. రొమాంటిక్ సీన్ చేయడం మొదటిసారి. అందుకని చాలా నెర్వస్ అయ్యా. ఒకరోజంతా ఎండు గడ్డిలో షూటింగ్​ చేయడం అంత ఈజీ కాదు.

తెల్లారేసరికి నా చర్మం మీద ర్యాషెస్​ వచ్చాయి. వాటితో చాలా ఇబ్బంది పడ్డా. ఆ సీన్​ చేసేటప్పుడు కష్టంగా అనిపించినా స్క్రీన్​ మీద చూడ్డానికి చాలా అందంగా వచ్చింది. మామూలుగా అయితే ఒకే యాంగిల్ నుంచి రీటేక్​లు చేయాల్సివస్తుంది.  అలా జరగకూడదని రోజులో సగం ప్రాక్టీస్​ చేయించారు. అందుకే సీన్​ చేసేటప్పుడు రీటేక్​లు అవసరం పడలేదు. ఆ రోజంతా నేను అద్దం కూడా చూసుకోలేదు. రిహార్సల్స్ చేశాక షాట్​ తీశారు. డైరెక్టర్​ ‘ఓకే’ అన్న తరువాత నేను రిలాక్స్​ అయ్యా. అప్పుడు నేను అద్దం చూసుకోవచ్చు అనుకున్నా. అప్పటికే నా కళ్లకు ఉన్న కాటుక పోయింది. కానీ, కళ్లు మాత్రం అందంగా కనిపించాయి. 

తను కో–ఆపరేటివ్​

హీరామండీలో నా రోల్ పేరు సైమా. నేను ఆలంజెబ్​ (షర్మిన్​)కి సహాయకురాలిని. మా ఇద్దరి కాంబినేషన్​లో సీన్స్ చాలా ఉంటాయి. స్క్రిప్ట్​లో కూడా మా ఇద్దరి క్యారెక్టర్స్​కి లింక్​ ఉంటుంది. ఈ జర్నీలో షర్మిన్​తో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్​పీరియెన్స్. తను ఎంత స్ట్రాంగ్​ అంటే ఏదైనా చేయాలనుకుంటే అది చేసేస్తుంది. తను చాలా కో–ఆపరేటివ్​గా ఉంటుంది. సెట్​లో ఒకరోజు నేను చాలా భయపడుతున్నా. అప్పుడు తను నా దగ్గరకు వచ్చి ‘ఏం కాదు. నీకు తెలుసు కదా. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు భయపడుతున్నావు’ అని సముదాయించింది.

అది ఆయన విజన్​

ప్రతి ఒక్కరికీ ఒక విజన్ ఉంటుంది. కానీ, అది వివరంగా ఉండాలి. చిన్న చిన్న వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్​లో చూస్తే క్వాలిటీ అమేజింగ్​ అనిపించాలి. సంజయ్​​ డైరెక్షన్ అలానే ఉంటుంది. చెప్తే నమ్మరు కానీ, సెట్​లోకి వెళ్లి చూస్తే మేం చదువుతూనే ఉంటాం. ఏ ఒక్క డైలాగ్​ అర్థంకాకపోయినా దాన్ని మార్చి, సాంగ్​కి మ్యాచ్ అయ్యేలా డైలాగ్స్​ రాస్తారు.  కొరియోగ్రఫీ, సాంగ్​ అన్నీ పర్ఫెక్ట్​గా అందరికీ కుదురుతాయి. సీన్​ ఏ మూడ్​లో ఉంటే దాన్ని బట్టి రూమ్ కలర్ ఉంటుంది.  దానికి తగ్గట్టు  యాక్టర్ ఏ కాస్ట్యూమ్​ వేసుకోవాలి? దానికి భిన్నంగా మిగతా యాక్టర్స్ బట్టలు ఎలా ఉండాలి? అనే అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఇలా డీటెయిలింగ్​గా ఉండడం వల్ల రెండేండ్లు పట్టింది.

రోజులో సగం క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. ఆ తరువాత అవి సజీవంగా, రియలిస్టిక్​గా ఉండేలా కేర్ తీసుకుంటారు. నా వరకు అయితే ఇది హిస్టరీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్​. ఒక అమ్మాయి మరో అమ్మాయి  జీవితాన్ని కాపాడడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఆ విధంగా పెరిగాం మేం అని చెప్తుంది ఈ సిరీస్. సైమా పాత్రలో యాక్ట్​ చేసినందుకు నాకు వస్తున్న ప్రశంసలు నా నటనకు జనాలు వేస్తున్న మార్కులే అనిపిస్తుంది.’’

అది నా డ్రీమ్

రెండేండ్లు భరతనాట్యం నేర్చుకున్నా. కానీ, పూర్తిగా ట్రైనింగ్ అవ్వలేదు. ఇంకా నేర్చుకోవాలనుంది. చాలామందికి డాన్స్, యాక్టింగ్ నేర్చుకోవాలి అని ఉంటుంది. కానీ, వాళ్లకు సరైన ప్లాట్​ఫాం దొరకట్లేదు. అలాంటివాళ్ల కోసం ఏదైనా చేయాలనుంది. భవిష్యత్తులో ఏదో ఒకరోజు డాన్స్​, యాక్టింగ్ అకాడమీ ఏర్పాటుచేయాలి అనుకుంటున్నా..