25 ఏళ్లుగా నా వెంటే ..నా కుడి భుజాన్ని కోల్పోయా..సిమ్రాన్ ఎమోష‌న‌ల్ నోట్

25 ఏళ్లుగా నా వెంటే ..నా కుడి భుజాన్ని కోల్పోయా..సిమ్రాన్ ఎమోష‌న‌ల్ నోట్

తెలుగు,తమిళ,హిందీ, మలయాళం సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సిమ్రాన్(Simaran). ఆమె తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వెలిగిన సిమ్రాన్..ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌ లోను  కీలక పాత్రలు పోషిస్తోంది. 

ఇదిలా ఉంటే..ఈ నెల (డిసెంబర్ 6న) సిమ్రాన్ మేనేజ‌ర్ ఎం‌.కామరాజన్ మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా సిమ్రాన్ మేనేజర్గా పనిచేసిన కామరాజన్ (Kamarajan) మృతితో సిమ్రాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. తాజాగా ఇదే విషయాన్ని సిమ్రాన్ తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ..ఓ ఎమోష‌న‌ల్ నోట్ రాసింది.

'నమ్మలేకపోతున్నా..దిగ్భ్రాంతికరమైన వార్త. నా ప్రియమైన స్నేహితుడు ఎం. కామరాజన్ ఇక లేరు. 25 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకుల్లో నా కుడి భుజంగా ఉన్నారు. నా ఎదుగుదలకు ఓ మెయిన్ పిల్లర్‌లా నిలబడ్డారు. చాలా చురుకైన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ..ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారు. చాలా నమ్మకంగా పనిచేసేవారు. మీరు లేకుండా నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను. ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఓం శాంతి’ అని కామరాజన్ తో ఉన్న స్నేహాన్నిరాసుకొచ్చారు'. ప్రస్తుతం సిమ్రాన్ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామరాజన్‌ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.