
మెగా డాటర్ నిహారికతో లవర్ బాయ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరుణ్ పెళ్లంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటుగా మొయిన్ స్ట్రీమ్‌లోనూ వార్తలు హల్‌చల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ గొప్పింటి అమ్మాయితో తరుణ్ పెళ్లి ఉంటుందని అతని తల్లి రోజారమణి చెప్పడం, మెగా డాటర్ నాగాబాబు కుమార్తె నిహారిక కూడా ఇటీవల విడాకులు తీసుకోవడంతో ఈ వార్తలు కుప్పులుకుప్పులుగా వచ్చాయి.
అయితే దీనిపై తరుణ్ క్లారిటీ ఇచ్చేశారు. ఇవన్నీ రూమర్స్ అంటూ సింపుల్‌గా కొట్టిపడేశారు. పెళ్లికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ముందుగా తానే చెబుతానని తెలిపారు. దీంతో మెగా డాటర్‌తో తరుణ్ పెళ్లంటూ గత కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలు రూమార్సేనని స్పష్టమైంది.
బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్ తెలుగు ఆడియన్స్‌కు బాగా సుపరిచితుడే. బాలనటుడిగా మెప్పించిన తరుణ్ ... నువ్వేకావాలి వంటి ఇండస్ట్రీ హిట్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కొద్దిరోజులకే లవర్ బాయ్ ఇమేజ్ తో పాటుగా స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు. కానీ ఓ క్రమంలో వరుస ఫ్లాప్‌లు తరుణ్‌ను వెంటాడి ఫేడ్ ఔట్ హీరోగా మార్చేశాయి. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ చేసుకుంటున్నారు.
అయితే తరుణ్ పెళ్లంటూ రూమర్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు.. 42 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ అతను ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పడాలంటే.. చక్కగా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని ఫ్యాన్స్ అతనికి సూచిస్తున్నారు.