అతడే మా బాస్..సీఎం అభ్యర్థిగా విజయ్‌..టీవీకేపార్టీ ప్రకటన ‌‌‌‌‌‌‌

అతడే మా బాస్..సీఎం అభ్యర్థిగా విజయ్‌..టీవీకేపార్టీ ప్రకటన  ‌‌‌‌‌‌‌

చెన్నై:తమిళగ వెట్రి కజగం(టీవీకే) వ్యవస్థాపక- అధ్యక్షుడు, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని  ఆ పార్టీ ప్రకటించింది. శుక్రవారం(జూలై4) కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ ప్రత్యేక తీర్మానాన్ని పార్టీ  ఆమోదించింది. 

అలాగే, పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి వచ్చే నెలలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని, గ్రామాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికార డీఎంకే లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోదని తెలిపారు. "చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రజలను మతపరంగా విభజించాలనుకుంటోంది. 

మన విధాన ప్రత్యర్థులతో, విభజన శక్తులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొత్తు ఉండదు. డీఎంకే లేదా బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం ఉండదని నేను గట్టిగా చెబుతున్నాను" అని ఆయన ప్రకటించారు.