రూమర్స్‌‌కి చెక్‌‌ పెట్టిన విక్రం

రూమర్స్‌‌కి చెక్‌‌ పెట్టిన విక్రం


తెలుగు సినిమా స్థాయి పెరుగుతున్న కొద్దీ ఇతర భాషల హీరోలంతా మన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ ఇప్పటికే నెగిటివ్ రోల్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ విక్రమ్ కూడా ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. అది కూడా మహేష్‌‌ బాబు సినిమాలో. అయితే ఇది నిజమా కాదా అనే డైలమాలో ఉన్నారంతా. ఎట్టకేలకి దీనిపై క్లారిటీ వచ్చింది. మహేష్‌‌ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో షూట్ స్టార్ట్ కానుంది. పూజాహెగ్డే హీరోయిన్‌‌. విలన్‌‌ రోల్‌‌ కోసం విక్రమ్‌‌ని అడిగారని, త్రివిక్రమ్ ఆల్రెడీ ఒప్పించారనే టాక్ వినిపిస్తోంది. అయితే మహేష్‌‌ బాబుకి సంబంధించిన ఎలాంటి సినిమాలోనూ విక్రమ్ నటించడం లేదని ఆయన మేనేజర్‌‌‌‌ తేల్చేశాడు. సర్క్యులేట్ అవుతున్నవన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. దాంతో ఈ బజ్‌‌కి బ్రేక్ పడింది. ఇక ఇటీవల ‘మహాన్‌‌’ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్రమ్.. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్, కోబ్రా సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేశాడు. త్వరలోనే అవి రిలీజ్ కానున్నాయి.