విశాల్–హరి హ్యాట్రిక్ కాంబో

విశాల్–హరి హ్యాట్రిక్ కాంబో

సక్సెస్‌‌‌‌, ఫెయిల్యూర్స్‌‌‌‌ను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్న విశాల్.. తన కొత్త సినిమాపై అప్‌‌‌‌ డేట్ ఇచ్చాడు. ఆరు, సామి, సింగం లాంటి మాస్‌‌‌‌ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌‌‌‌ అయిన హరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. డైరెక్టర్ కార్తిక్‌‌‌‌ సుబ్బరాజ్‌‌‌‌కు చెందిన స్టోన్ బెంచర్స్‌‌‌‌ సంస్థ, జీ స్టూడియోస్‌‌‌‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

విశాల్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 34వ సినిమా. ఆదివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. స్టెతస్కోప్, బేడీలు, కత్తులు, గన్నులతో డిజైన్ చేసిన అనౌన్స్‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను బట్టి మెడికల్‌‌‌‌ మాఫియా బ్యాక్‌‌‌‌డ్రాప్ స్టోరీ ఇదని అర్థమవుతోంది. ఇప్పటికే విశాల్, హరి కాంబినేషన్‌‌‌‌లో భరణి, పూజ చిత్రాలు వచ్చాయి. ఇది మూడో చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి.