Kalki 2898 AD: కల్కి మూవీకి స్టార్స్ భారీ రెమ్యునరేషన్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా?

Kalki 2898 AD: కల్కి మూవీకి స్టార్స్ భారీ రెమ్యునరేషన్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా?

ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లడానికి వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ భారీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. టీజర్, ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే జూన్ 27 కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తన్నారు. 

ఇదిలా ఉంటే.. కల్కి 2898 ఏడీ సినిమాలో దేశవ్యాప్తంగా ఉన్న స్టార్స్ నటించారు. వారిలో బాలీవుడ్ నుండి అమితాబ్, దీపికా పడుకొనే, దిశా పటాని, తమిళం కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ భారీ సినిమా కోసం మన స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం స్టార్స్ రెమ్యునరేషన్స్ కే రూ.250 కోట్ల వరకు ఖర్చు అయిందట. 

ఇక డీటెయిల్స్ లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమా కోసం రూ.150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఆయన తరువాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి రూ.20 కోట్లు, లోకనాయకుడు కమల్ హాసన్ కి రూ.20 కోట్లు ఇచ్చారట. ఇక దీపికకి రూ.12 కోట్లు, దిశాకి రూ.3 కోట్లు వరకు ఇచ్చారట. మిగిలిన నటీనటులు, సాకేతికనిపుణులకు కలిపి 50 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక మొత్తగా దాదాపు రూ.250 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ కి పోగా.. మిగిలిన రూ.450 కోట్లతో సినిమా చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.