కాంగ్రెస్‌‌లో చేరిన నటి దివ్యవాణి

కాంగ్రెస్‌‌లో చేరిన నటి దివ్యవాణి

హైదరాబాద్, వెలుగు: సినీ నటి, టీడీపీ లీడర్ దివ్యవాణి కాంగ్రెస్‌‌లో చేరారు. బుధవారం గాంధీ భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు దగ్గర పనిచేయడం ఆనందంగా ఉన్నప్పటికీ, కొన్ని కారణాలతో టీడీపీని వీడానని దివ్యవాణి చెప్పారు. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌‌లో పనిచేయడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు.

పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానన్నారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌‌తోనే సాధ్యం అని, పార్టీకి అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకతీయ వర్సిటీ జేఏసీ నాయకురాలు సాహితీ కూడా కాంగ్రెస్‌‌లో చేరారు. ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.