కేజీయఫ్‌ నటుడితో టాలీవుడ్ హీరోయిన్‌ నిశ్చితార్థం

కేజీయఫ్‌ నటుడితో టాలీవుడ్  హీరోయిన్‌ నిశ్చితార్థం

శాండల్‌వుడ్ నటి హరిప్రియ, కేజీయఫ్‌ నటుడు వశిష్ట సింహతో పెళ్లికి సిద్ధమైంది. డిసెంబర్ 2న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.  ‘‘మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మీ ఆశీస్సులు కావాలి’’ అని పోస్ట్‌ పెట్టారు.  బెంగుళూరులోని హరిప్రియ నివాసంలో ఈ నిశ్చితార్థ వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి వశిష్ఠ, హరిప్రియ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో హరిప్రియ పసుపు రంగు చీరలో ముస్తాబు కాగా, వశిష్ట  పసుపు రంగు షర్ట్ తో పాటు ధోతిని  ధరించాడు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘తకిట తకిట’ చిత్రంతో హరిప్రియ టాలీవుడ్ కు పరిచయమైంది.  ఈ తరువాత ‘పిల్ల జమీందార్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘గలాట’, ‘జై సింహా’  చిత్రాలలలో నటించింది. అటు ‘కేజీయఫ్‌’లో కమల్‌ పాత్ర పోషించిన  వశిష్ట సింహకు బాగానే గుర్తింపు వచ్చింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలో వివాహబంధంతో ఒకటి కానున్నారు.