ఆమధ్య బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీలో పలువురితోపాటూ తెలుగు ప్రముఖ నటి హేమపై కూడా పోలీసులు ఛార్జి షీటు నమోదు చేసారు. దీంతో నటి హేమ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కి పంపించి పరీక్షించారు.
తాజాగా నటి హేమ ఈ విషయంపై ఓ వీడియో ద్వారా స్పందించింది. ఇందులో భాగంగా రేవ్ పార్టీ వ్యవహారంలో తనకి నిర్వహించిన రక్తనమూనా పరీక్షలలో తనకి నెగిటివ్ వచ్చినట్లు తన లాయర్ ఫోన్ చేసి చెప్పాడని తెలిపింది. ఈ క్రమంలో తాను ఇప్పటికే ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పానని కానీ నాకు ఆఫీషియల్ గా నెగిటివ్ రావడంతో చార్జిషీట్ లో నెగిటివ్ అని రాసారని చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది.
ALSO READ | బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్ : నటి హేమపై టాలీవుడ్ ఇప్పుడు ఏం చేయబోతుంది?
ఇక కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తన గురించి లేనిపోనివి ప్రచారం చేస్తూ కావాలని నిందలు వేశారని తెలిపింది. అలాగే తనగురించి అసత్య కథనాలు ప్రచారం చేసినవారిపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని కూడా హెచ్చరించింది.