రూ.5 కోట్లకు రూ.3 కోట్లే ఖర్చుచేశారు..మిగతా డబ్బులేవి?

V6 Velugu Posted on Aug 07, 2021

మా ( మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)  అధ్యక్షుడు నరేష్ పై సినీ నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.5కోట్ల నిధులలో  నరేష్ ఇప్పటి వరకు రూ.3 కోట్లే ఖర్చు చేశారని..మిగిలిన డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ఏడాది మా ఎన్నికలు జరగకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు లేకుండా నరేష్ ను మళ్లీ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగకుండా ఉండేందుకు నరేష్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ఏడాది మా ఎన్నికలు జరిగేలా చూడాలంటూ  200 మంది సభ్యులతో  ఆమె సంతకాలు సేకరించారు.  మా అధ్యక్ష ఎన్నికలకు ఈ సారి ఐదుగురు బరిలో దిగుతున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్,సీవీఎల్ నరసింహరావు పోటీచేస్తామని ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించారు. 

 

Tagged ELECTIONS, Naresh, Maa, prakashraj, Hema, 5crores

Latest Videos

Subscribe Now

More News