
ఒక్కోసారి సినిమా మొత్తం నటించడం కంటే సింగిల్ సాంగ్‌తో వచ్చే క్రేజే ఎక్కువ. అందుకే బాలీవుడ్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్‌లో అవకాశం వస్తే ఠక్కున ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరవబోతోందట. అది కూడా తెలుగులో. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్ ‘బర్ఫీ’ ఊరించడంతో ముంబై వెళ్లింది ఇలియానా. అక్కడ ఆశించిన స్థాయి సక్సెస్ రాక ఇప్పటికీ స్ట్రగులవుతోంది. ఆమధ్య ‘అమర్ అక్బర్ ఆంటోని’తో తిరిగి టాలీవుడ్లో మెరిసినా, ఆ మూవీ రిజల్ట్ నిరాశ పరిచింది. దీంతో తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు రవితేజ సినిమాతోనే టాలీవుడ్‌కి రానుందట. రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్. స్పెషల్ సాంగ్‌కి ఓ పాపులర్ హీరోయిన్‌నే తీసుకోవాలని ఫిక్స్ అయిన టీమ్, ఇలియానాని అడిగితే ఓకే చెప్పిందట. తను నటించిన ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘రుద్ర’ వెబ్ సిరీస్‌లోనూ నటించనుందని తెలిసింది. ఇప్పుడీ ఆఫర్ వచ్చిందంటే ఇలియానా కెరీర్ మళ్లీ ఇన్నాళ్లకు కాస్త స్పీడందుకుందన్నమాట.