
‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది కృతిశెట్టి. నాగచైతన్యకి జంటగా నటించిన ‘కస్టడీ’ చిత్రంతో తమిళ ప్రేక్షకులను కూడా పలకరించిన ఆమె.. ఇకపై అక్కడా వరుస సినిమాలు చేసే ప్లాన్‌లో ఉంది. తాజాగా ఓ తమిళ సినిమాకు కమిట్ అయిందట కృతి. జయం రవి హీరోగా మిస్కిన్ అసిస్టెంట్ భువనేష్ అర్జునన్ దర్శకత్వంలో ఇటీవల ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
ఏ.ఆర్.రెహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా కృతిని సెలెక్ట్ చేశారట మేకర్స్. కృతి నటించిన తెలుగు సినిమాలు తమిళంలో విడుదలైనా.. తమిళ హీరోకి జంటగా నటించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. గతంలో సూర్యకి జంటగా బాల దర్శకత్వంలో నటించినా.. అది మధ్యలోనే ఆగిపోయింది. అలాగే టోవినో థామస్ ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్న ‘ఏఆర్ఎమ్’ చిత్రంతో.. మలయాళంలోనూ అడుగుపెడుతోంది కృతిశెట్టి.