చిత్రపరిశ్రమలో విషాదం... మీనా భర్త విద్యాసాగర్ మృతి

చిత్రపరిశ్రమలో విషాదం... మీనా భర్త విద్యాసాగర్ మృతి

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) హఠాన్మరణం పొందారు. మంగళవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని సమాచారం. గత కొన్ని రోజులుగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే జనవరిలో కరోనా కారణంగా మీనా కుటుంబం మొత్తం కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే విద్యాసాగర్ కు ఈ సమస్య ఇంకా ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కు తోడు... కరోనా కూడా తోడు కావడంతో సమస్య తీవ్రమైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యం  మరింత విషమమై విద్యాసాగర్ కనుమూసినట్టు సమాచారం. 2009లో బెంగుళూరుకు చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్, హీరోయిన్ మీనాల వివాహం జరిగింది. ఈ దంపతులకు నైనిక అనే ఓ కుమార్తె కూడా ఉంది. ఇకపోతే విద్యాసాగర్ మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన ప్రముఖులు.. ఆయనకు నివాళులర్పిస్తున్నారు.