హీరోయిన్ నమితకు కవలలు

హీరోయిన్ నమితకు కవలలు

హీరోయిన్ నమిత కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. " నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు.  కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలి" అని నమిత పోస్ట్ చేసింది.

ప్రెగ్నెన్సీ జర్నీలో తనని గైడ్‌ చేసినందుకు హాస్పిటల్‌ సిబ్బందికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.  దీంతో పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వెంకటేష్ హీరోగా వచ్చిన జెమిని చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నమిత.

ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, బిల్లా తదితర చిత్రాలలో నటించింది. 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. ఇప్పుడు వీరికి కవల పిల్లలు పుట్టారు.