బీజేపీలో చేరిన మరో హీరోయిన్

బీజేపీలో చేరిన మరో హీరోయిన్

సినీ నటి నమిత బీజేపీలో చేరారు.  ఆ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. నమిత తెలుగు,తమిళంలో పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో జెమినీ, సొంతం, సింహా, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, బిల్లా వంటి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నమిత 2016 లో అన్నాడీఎంకేలో చేరారు. మళ్లీ శనివారం బీజేపీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నమిత పోటీ చేస్తారని సమాచారం.