'చాయ్‌ వాలే'లో నయనతార పెట్టుబడులు

V6 Velugu Posted on Jul 31, 2021

ఎంతో మంది సినీ నటీ,నటులు సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌తో పాటు పెద్ద పెద్ద హోటల్స్‌, రెస్టారెంట్స్‌, పబ్‌లు వంటి పలు వ్యాపారాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. లేటెస్టుగా నయనతార కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టింది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్‌ 'చాయ్‌ వాలే'లో ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సంస్థకు రూ.5 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇందులో నయన్‌, ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. 

'చాయ్‌ వాలే' దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్‌ స్టోర్లను తీసుకొస్తోంది. ఏడాది లోపల పూర్తిగా పని చేసే 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక అని సమాచారం. ఈ సంస్థలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడి పెట్టారు. 

Tagged invest, Actress Nayanthara, Vignesh Shivan, Chai Waale

Latest Videos

Subscribe Now

More News