NivethaPethuraj: క్రేజీ ఫొటోలతో ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరీ రజిత్ ఇబ్రాన్?

NivethaPethuraj: క్రేజీ ఫొటోలతో ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరీ రజిత్ ఇబ్రాన్?

హీరోయిన్ నివేదా పేతురాజ్.. (Nivetha Pethuraj) పరిచయం అక్కర్లేని పేరు. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూనే, కార్ రేసింగ్, బ్యాడ్మింటన్‌ వంటి స్పోర్ట్స్లో రాణిస్తుంది. ఈ 33 ఏళ్ల బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది.

ఈ విషయాన్ని ఇన్స్టా ద్వారా తెలిపింది. తన ప్రియుడు, బిజినెస్ మెన్ రజిత్ ఇబ్రాన్‌ను పరిచయం చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. "నా ప్రస్తుతానికి మరియు ఎప్పటికీ" అనే క్యాప్షన్‌తో ఈ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అయితే, నివేదా నిశ్చితార్థం కంప్లీట్ అయ్యాకనే ఈ విషయాన్ని రివీల్ చేసినట్లు టాక్.

ఈ క్రమంలో నివేదాకు కాబోయే వరుడు గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్లు. నివేదా ప్రియుడు పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్‌. అతను దుబాయ్‌లో ఓ బడా వ్యాపారవేత్త అని, కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. రాజ్‌హిత్ దుబాయ్‌లో వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నట్లు టాక్. ఈ ఏడాదిలోనే నివేదా, రాజ్‌హిత్‌ల మ్యారేజ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం నివేదా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండటంతో సెలబ్రెటీలు, ఫ్యాన్స్ విషెష్ చెబుతున్నారు. 

Also Read : టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో వినాయక చవితి వేడుకలు

నివేదా పేతురాజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో శ్రీ విష్ణు తో హీరోగా తెరకెక్కిన మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది.

ఇక ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అలావైకుంఠపురంలో, చిత్రలహరి, దాస్ కా ధమ్కీ వంటి మూవీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల 'బూ' అనే హారర్ సినిమాలో ఆమె కనిపించింది.