రేణుకాస్వామి మడ్డర్ మిస్టరీ: కామెంట్స్ పెడుతున్నాడని చంపించారు

రేణుకాస్వామి మడ్డర్ మిస్టరీ:  కామెంట్స్ పెడుతున్నాడని చంపించారు

కన్నడ స్టార్ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. రేణుకాస్వామి(33) మడ్డర్ కేసులో దర్శన్ కు కూడా ప్రాత ఉందని పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. నటి పవిత్ర గౌడ సోషల్ మీడియా పోస్టులకు రేణుకాస్వామి తరుచూ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ ఉండేవాడట. ఈ విషయంలో రేణుకాస్వామిపై ఏదైనా యాక్షన్ తీసుకోవాలని పవిత్ర దర్శన్ ను  కోరింది. పవిత్ర ఒత్తిడి కారణంగానే రేణుస్వామిని చంపించినట్లు దర్శన్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో పవిత్ర గౌడను పోలీసులు మొదటి నిందితురాలిగా చేర్చారు. ఆమె డిమాండ్ మేరకే హత్య జరిగిందని తేలింది. దర్శన్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. వీరితో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 11 మందిని అరెస్టు చేశారు. 

చిత్రదుర్గలోని ఓ ఫార్మసీలో ఉద్యోగి అయిన రేణుకాస్వామి అభిమానుల వర్గాల్లో ఛాలెంజింగ్ స్టార్ గా పాపుల‌ర‌య్యారు. అత‌డు దర్శన్‌కి వీరాభిమాని. అయితే వివాహితుడైన దర్శన్ - పవిత్ర మధ్య వివాహేత‌ర‌ సంబంధాన్ని అతడు ఆమోదించలేదు. ఇది దర్శన్ ప్రతిష్టను దిగజార్చిందని రేణుకాస్వామి నమ్మాడు. అతడు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించాడు. ప‌విత్రకు  అసభ్యకరమైన సందేశాలు పంపడం.. ఆమె పోస్ట్‌లపై అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఓ గ్యాంగ్ కు రూ.30 లక్షలు ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. అడ్వాన్స్ గా ముందు దర్శన్ వారికి రూ.5 లక్షలు ఇచ్చాడు.

రేణుకాస్వామి మృతదేహం కామాక్షిపాళ్యంలోని మురుగు కాలువలో పడి ఉంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ కుక్కలు తినేస్తున్న మృతదేహాన్ని మొదట గుర్తించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అత‌డు ద‌ర్శన్ అబిమాని రేణుకాస్వామి అని గుర్తించారు. దీంతో తొలుత‌ ఇద్దరు వ్యక్తులు కామాక్షిపాళ్యం పోలీసులకు లొంగిపోయి హత్య చేసినట్లు అంగీకరించారు. ఆర్థిక తగాదాలే హత్యకు కారణమని వారు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, పోలీసులు వారి వాంగ్మూలంలో తేడాలున్నాయ‌ని గుర్తించి విచారించారు. ఈ విచార‌ణ‌లో దర్శన్ స‌హా ఇతరుల పాత్ర బ‌య‌ట‌ప‌డింది. తదనంతరం మైసూర్‌లోని దర్శన్ - పవిత్రల‌ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన 13 మంది నిందితులను ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బుధవారం దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను సాక్ష్యాధారాల సేకరణ కోసం నేరం జరిగిన షెడ్డుకు తీసుకొచ్చారు.