బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌తో బిజీబిజీగా పూజ

బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌తో బిజీబిజీగా పూజ

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయిన పూజా హెగ్డే.. సక్సెస్‌‌‌‌లు, ఫెయిల్యూర్స్‌‌‌‌తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే అరడజనుకు పైగా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా తన లిస్టులో మరో మూవీ చేరింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి జంటగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పూజ. సూర్య నలభై రెండో సినిమా శివ దర్శకత్వంలో ఉంటుందని కొన్నాళ్ల క్రితం అనౌన్స్‌‌‌‌ చేసిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌‌‌‌గా పూజని ఫిక్స్ చేశారట. త్వరలోనే మూవీ సెట్స్‌‌‌‌కి వెళ్లనుంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌తో బిజీబిజీగా ఉంది పూజ.

లాస్ట్ వీక్ సల్మాన్‌‌‌‌తో కలిసి లడఖ్‌‌‌‌లో ‘భాయిజాన్’ షూటింగ్‌‌‌‌లో పాల్గొంది. నిన్నటితో ఆ షెడ్యూల్ కంప్లీటయ్యింది. వచ్చే వారం నుంచి ముంబైలో ఇంపార్టెంట్ సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌ కూడా తీయనున్నారట. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ కల్లా షూటింగ్‌‌‌‌ పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు. ఫర్హాద్ సామ్‌‌‌‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌ వెంకటేష్‌‌‌‌తో పాటు జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 30న సినిమా రిలీజ్. ఇక రణ్‌‌‌‌వీర్ సింగ్‌‌‌‌తో పూజ నటిస్తున్న ‘సర్కస్’ డిసెంబర్ 22న విడుదల కానుంది. విజయ్ దేవరకొండతో కలిసి ‘జనగణమన’లో నటిస్తోంది, మహేష్, త్రివిక్రమ్ మూవీలోనూ పూజయే హీరోయిన్. త్వరలో యశ్‌‌‌‌తో కూడా ఓ సినిమా చేయబోతోంది పూజ. అంటే ఇక కన్నడ సీమలోనూ తన కరిష్మాని చూపించబోతోందన్నమాట!