డ్రగ్స్ కేసులో ఫైల్ తో ఈడీ ముందు హాజరైన రకుల్

V6 Velugu Posted on Sep 03, 2021

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్  ప్రీత్ సింగ్ ఈడీ ముందు విచారణకు హాజరైంది. కెల్విన్ కు ఆమె నగదు పంపించినట్లుగా ఈడీ ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో కెల్విన్ తో సంబంధాలు, అనుమనానస్పద ట్రాన్సాక్షన్స్ పై ప్రధానంగా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నథ్ తో పాటు నటి చార్మిని ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు లేఖరాసింది. ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. ముందుగా ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. తర్వాత ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు. దాంతో ఈడీ విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. ఉదయం పదిన్నరకు విచారణకు హాజరవ్వాలని అధికారులు సూచించారు. దాంతో రకుల్ గంటన్నర ముందుగానే ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాగా.. గతంలో సిట్ అధికారులు చేసిన విచారణలో రకుల్ పేరు లేదు. కానీ ఈసారి ఆమె పేరు చేరడంతో చర్చనీయాంశంగా మారింది. 

 

Tagged Hyderabad, Drugs Case, Rakul Preet Singh, ED, puri jagannath, charmi, kelvin, Drugs case inquiry

Latest Videos

Subscribe Now

More News