ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరియు మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే కేటీఆర్ ని విమర్శించే క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటి సమంత వ్యక్తిగత జీవితంపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం రాజీకీయాల్లో అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోహాట్ టాపిక్ గా మారింది. దీంతో నటి సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ALSO READ | కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు : మంత్రి కొండా సుురేఖ
ఇందులో భాగంగా ఒక స్త్రీగా ఉండి బయటికొచ్చి పని చేయడమే కాదు, గ్లామరస్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవడం చాలా కష్టమని దానికి చాలా ధైర్యం, బలం కావాలని చెప్పుకొచ్చింది. కొండాసురేఖ గారూ నా ఈ సినిమా ఇండస్ట్రీ జీవిత ప్రయాణాన్నిచిన్న చూపు చూడకండి అంటూ అలాగే మంత్రి హోదాలో మీరు మాట్లాడే మాటలకి చాల గౌరవం ఉంటుందని ఈ విషయాన్ని గమనించాలని కోరింది. అలాగే ఇతరుల ప్రైవసీ ని మీరు గౌరవిస్తారని భావిస్తున్నాని అన్నారు.
ఇక తన విడాకుల గురించి స్పందిస్తూ "నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయని ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదని" స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని అలాగే తాను ఎప్పుడూ రాజకీయాలకి అతీతంగా మరియు దూరంగా ఉంటానని తెలిపింది.