Samantha: డైరెక్టర్ గా సమంత.. లవ్ స్టోరీతో కొత్త ప్రయాణం!

Samantha: డైరెక్టర్ గా సమంత.. లవ్ స్టోరీతో కొత్త ప్రయాణం!

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఒక వైపు ఆరోగ్య సమస్యలు ఉన్నా, వాటిని అధిగమించి సమంత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హీరోయిన్ గానే కాకుండా, నిర్మాతగా కూడా తనను తాను నిరూపించుకుంది. ఇటీవల ఆమె నిర్మించిన 'శుభం'  సినిమా విజయం సాధించడంతో, ఆమెలో కొత్త ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకేసి, మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

యంగ్ ఆర్టిస్టులతో .. 
సమంత దర్శకురాలిగా మారనుందనే వార్తలు ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఆమె ఇప్పటికే ఒక అందమైన ప్రేమకథను సిద్ధం చేశారని, దానిని తన సొంత బ్యానర్‌లోనే నిర్మించనున్నారని సమాచారం. యంగ్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీయాలని ఆమె ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కొందరితో చర్చలు కూడా జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also read:-గోవింద, సునీత మధ్య విబేధాలు.. విడాకులకు దారితీసిన కారణాలు ఇవేనా?

దర్శకురాలిగా కొత్త రోల్
సమంత కెరీర్ చూస్తే, ఆమె నటిగా తన ప్రయాణాన్ని 'ఏ మాయ చేసావే' అనే బ్లాక్‌బస్టర్ లవ్ స్టోరీతో ప్రారంభించారు. ఇప్పుడు దర్శకురాలిగా కూడా ప్రేమకథనే ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆమె తొలి సినిమా నుంచి ప్రేమకథలను హ్యాండిల్ చేయడంలో తనదైన మార్క్ చూపించారు. 'ఏ మాయ చేసావే'తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

ప్రస్తుతం ఆమె చేతిలో 'రక్త్ బ్రహ్మండ్ ', 'మా ఇంటి బంగారం' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి, ఆమె దర్శకురాలిగా మారడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పవచ్చు. అయితే  సమంత ఎలాంటి కథతో దర్శకురాలిగా పరిచయం కానుందో, ఆ సినిమా ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.