Shreya Dhanwanthary : 40 ఏళ్లుగా విమాన రంగంలో ఉన్న..ఆయనకు ట్రైన్ జర్నీ అంటేనే ఇష్టం

Shreya Dhanwanthary : 40 ఏళ్లుగా విమాన రంగంలో ఉన్న..ఆయనకు ట్రైన్ జర్నీ అంటేనే ఇష్టం

ప్రస్తుతం విమానయానంలో ప్రయాణం చేస్తూ..చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వార్తలు వారం రోజులుగా వింటూ వస్తున్నాం. రీసెంట్గా ఇండిగో ఫ్లైట్ ఆలస్యం కావడం వల్ల గోవా-ఢిల్లీ ప్రయాణికులు విమానం పక్కనే భోజనం చేస్తున్న ఫొటోస్, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే, బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా విమాన‌శ్ర‌యంలోని ఏరోబ్రిడ్జ్ లో ఇరుక్కుపోయినట్లు పోస్ట్ చేసింది. 'విమానం ఆల‌స్య‌మైంది. మ‌మ్మ‌ల్ని ఏరో బ్రిడ్జ్ లో లాక్ చేసారు. కొందరు ప‌సి పిల్ల‌ల‌తో ఉన్నారు. ఇక్క‌డ నీళ్లు.. టాయిలెట్లు కూడా అందుబాటులో లేవు. సెక్యురిటీ డోర్స్ ఓపెన్ చేయ‌డం లేదు' అని త‌న ఆవేద‌నని ఓ పోస్ట్ లో రాసుకొచ్చింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Radhika (@radhikaofficial)

 

ఇపుడు లేటెస్ట్గా విమానయాన పరిస్థితిపై బాలీవుడ్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫేమస్ వెబ్ సిరీస్ స్కామ్ 1992 - ది హర్షద్ మెహతా స్టోరీలో..జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్న నటి శ్రేయా ధన్వంతరి. ఈ బ్యూటీ విమానయాన రంగానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 'మా నాన్న 40 ఏళ్లుగా ఏవియేషన్ రంగంలో ఉన్నారు. అయినప్పటికీ మా నాన్న రైలులో ప్రయాణించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు..అని పోస్ట్ ద్వారా వెల్లడించింది. దీంతో నెటిజన్స్ ఏవియేషన్ పనితీరుపై వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

అందులో భాగంగా ఒక నెటిజన్ ట్వీట్కు రియాక్ట్ అవుతూ..ఏదైనా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారా అని శ్రేయాని అడిగారు. మరో నెటిజన్ పవన్ యాదవ్..విమానయాన రంగంలోని సమస్యలను సరైన టైములో నెరవేర్చడంలో ఏవియేషన్ వాళ్ళు ఫెయిల్ అయితే..ఎయిర్‌లైన్స్‌పై జరిమానా విధించాలని ఆయన సూచించారు. మరో ప్రయాణికుడు ట్వీట్ చేస్తూ..'రైలు ప్రయాణంతో ఏ ప్రయాణమూ పోల్చబడదు' అని ట్రైన్ జర్నీ ని హైలెట్ చేస్తూ అన్నారు.

మరోక నెటిజన్ మాట్లాడుతూ..ఒక ప్రయాణికుడు విమానంలో ప్రయాణించేటప్పుడు కలిగిన సమస్యను హైలైట్ చేసారు.  మరియు అదే ప్రయాణాన్ని ట్రైన్ లో కాకుండా విమానంలో చేస్తే ఎంత సమయం ఆదా అవుతుంది. అంటూ ప్రశ్నించారు. ఏదేమైనప్పటికీ రైల్వేలో పనిచేస్తున్నఎంతో మంది అనుభవజ్ఞులు విమాన ప్రయాణం చేయడానికి ఇష్టపడతారని మరికొంతమంది పోస్ట్స్ చేస్తున్నారు. 

దేశంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యం కారణంగా..విమానం లోపల, విమానాశ్రయంలో ప్రయాణికులు ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇపుడు ఇదే సమస్య రోజు రోజుకు పెద్దది అవుతుండటంతో..ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగింది.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానాల ఆలస్యం గురించి ఆరా తీసారు. విమానాలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ఆ విమానాన్ని రద్దు చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థను అనుమతించింది. ప్రస్తుతం శ్రేయా ధన్వంతరి ట్వీట్ చేయడంతో ఈ ఇష్యూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

శ్రేయా ధన్వంతరి మూవీస్ విషయానికి వస్తే..గన్స్ అండ్ గులాబ్, ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ ముంబై డైరీస్ వంటి అనేక వెబ్ సిరీస్‌లలో నటించింది. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఆర్ బాల్కీ యొక్క చుప్లో కూడా శ్రేయా కనిపించింది.