Shwetta Parashar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్వేత పరిషార్

Shwetta Parashar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్వేత పరిషార్

సినీ నటి శ్వేత పరిషార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ గురువారం (సెప్టెంబర్4న) ఉదయం విఐపి విరామ సమయంలో నటి శ్వేత స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటి శ్వేత పరిషార్ సినిమాల విషయానికి వస్తే.. 'అలాంటి సిత్రాలు' మూవీలో నటించింది. హిందీలో 'సూసైడ్ ఆర్ మర్డర్' సినిమాలో "ది ట్రబుల్ మేకర్" అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం నుండి ప్రేరణ పొంది తెరకెక్కించబడింది.